జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాం వద్ద జరిగిన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా తీవ్ర ఆవేదన కలిగించింది. ఈ దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. విచారణ నిమిత్తం రంగంలో దిగిన జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ఈ దాడికి ప్రధాన సూత్రధారి లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన ఖలీద్ అని తేల్చింది. ఖలీద్ అసలు పేరు సైఫుల్లా కసూరి కాగా, అతను పాకిస్తాన్‌కు చెందిన 30 ఏళ్ల వ్యక్తి. అతను లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్‌కు అత్యంత సన్నిహితుడిగా వ్యవహరిస్తున్నాడు.ప్రస్తుతం ఖలీద్ లష్కరే తోయిబా పెషావర్ ప్రధాన కార్యాలయానికి అధిపతిగా ఉన్నాడు. అంతేకాకుండా, మిల్లీ ముస్లిం లీగ్ అనే సంస్థకు అధ్యక్షుడిగా కూడా వ్యవహరిస్తున్నాడు. ఈ సంస్థ జమాత్ ఉద్ దవా అనే హఫీజ్ సయీద్‌కు చెందిన రాజకీయ విభాగానికి అనుబంధంగా పనిచేస్తోంది. NIA సమాచారం ప్రకారం, జమాత్ ఉద్ దవా పంజాబ్ ప్రావిన్స్‌లోని సమన్వయ విభాగాన్ని కూడా ఖలీద్ పర్యవేక్షిస్తున్నాడు.పహల్గాం దాడిలో నేరుగా పాల్గొన్న ఉగ్రవాదుల బృందానికి నాయకత్వం వహించిన వ్యక్తి ఆసిఫ్ ఫౌజీగా గుర్తించారు. ఇతను ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF)లో కీలక నేతగా వ్యవహరిస్తున్నాడని తేలింది. TRF అనేది లష్కరే తోయిబాకు అనుబంధంగా పనిచేస్తున్న మరో ఉగ్రవాద సంస్థ. ఆసిఫ్ ఫౌజీ పాక్ ఆర్మీతో సంబంధాలు కలిగి ఉండటంతో అతనికి “ఫౌజీ” అనే పేరు లభించింది. ఇతను జమ్మూ కశ్మీర్‌కు చెందిన వాడే కావడం గమనార్హం.

పహల్గాం దాడికి సూత్రధారి ఖలీద్ – NIA వెల్లడిఉగ్రదాడి తరువాత ఉగ్రవాదులు ముజఫరాబాద్ ప్రాంతంలోని సేఫ్ హౌజ్‌ల వైపు పారిపోయారని NIA ఆధారాలు సేకరించింది. భద్రతా సంస్థలు ముగ్గురు ఉగ్రవాదుల ఫోటో స్కెచ్లను విడుదల చేశాయి. టిఆర్ఎఫ్ గురించి మరింత సమాచారం ప్రకారం, ఈ సంస్థ 2017లో ఏర్పడినది. 2019లో ఆర్టికల్ 370 రద్దు తరువాత, కాశ్మీర్‌లో కాశ్మీరేతరులు మరియు వలస కూలీలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రదాడులు జరిపిన ఘటనల్లో పాల్గొంది.2020 నుండి ఇప్పటివరకు ఈ సంస్థ దాదాపు 50 మందికి పైగా వలస కూలీలు, భద్రతా సిబ్బందిని హత్య చేసిన ఘోరమైన చరిత్ర కలిగి ఉంది. TRF కమాండర్‌గా సజ్జాద్ గుల్ వ్యవహరిస్తున్నాడు. ఇతనిని భారత ప్రభుత్వం ఇప్పటికే ఉగ్రవాదిగా ప్రకటించింది. ప్రస్తుతం అతను పాకిస్థాన్‌లో తలదాచుకున్నట్టు భద్రతా సంస్థలు గుర్తించాయి. టిఆర్ఎఫ్‌లో పనిచేస్తున్న ఉగ్రవాదుల్లో ఎక్కువగా స్థానికులు ఉండటం భద్రతా పరంగా ఆందోళన కలిగిస్తోంది.
Read More : CM Revanth : జపాన్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న రేవంత్ రెడ్డి