Free seats : ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత సీట్లు.. 28 నుంచి దరఖాస్తులు

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రైవేట్ పాఠశాలల్లో 2025–26 విద్యా సంవత్సరానికి గాను పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ఉచిత సీట్ల కోసం దరఖాస్తుల ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించబోతోంది. ప్రభుత్వం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం, ఫస్ట్ క్లాస్‌లో ప్రవేశాల కోసం ఈ నెల 28వ తేదీ నుంచి మే 15 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఉచిత విద్యా హక్కు చట్టం (RTE) ప్రకారం ప్రైవేట్ స్కూళ్లలో 25 శాతం సీట్లు ఆర్థికంగా వెనుకబడిన వర్గాల పిల్లలకు కేటాయించనున్నారు.

AP private school Free seat

దరఖాస్తు చేసే విద్యార్థి వయస్సు 2025 జూన్ 1 నాటికి కనీసం 5 సంవత్సరాలుదరఖాస్తు ప్రక్రియలో భాగంగా తల్లిదండ్రులు తమ చిరునామాను ధ్రువీకరించే డాక్యుమెంట్లు సమర్పించాల్సి ఉంటుంది. ఇందులో ఆధార్ కార్డు, ఓటరు ఐడీ, రేషన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ లేదా విద్యుత్ బిల్లు వంటివి సరైన గుర్తింపుగా పరిగణించబడతాయి. దరఖాస్తు చేసే విద్యార్థి వయస్సు 2025 జూన్ 1 నాటికి కనీసం 5 సంవత్సరాలు నిండి ఉండాలి. ఈ నిబంధనలు పాటించనప్పుడు దరఖాస్తులు తిరస్కరించబడే అవకాశం ఉంది.

లక్షలాది మంది పేద విద్యార్థులకు ఉత్తమమైన విద్య

ఈ విధానంలో లక్షలాది మంది పేద విద్యార్థులకు ఉత్తమమైన ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఉచితంగా చదివే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తోంది. దీనివల్ల సామాన్య కుటుంబాల విద్యా భారం తగ్గి, సమాన విద్యా అవకాశాలు అందుబాటులోకి రావడం జరుగుతుంది. తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, తప్పకుండా అవసరమైన డాక్యుమెంట్లు సిద్ధం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *