
Vidadala Rajini: మాజీ మంత్రి, వైసీపీ మహిళా నేత విడుదల రజనికి బిగ్ షాక్ తగిలింది. ఆమె మరిది గోపిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. హైదరాబాద్ లో ఆయన్ను అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు.. విజయవాడకు తరలిస్తున్నారు. యడ్లపాడు కంకర క్వారీ యజమానులను బెదిరించి రూ.2.20 కోట్లు అక్రమంగా వసూలు చేశారని రజినితోపాటు గోపీపై కేసు నమోదైంది. ఈ క్రమంలోనే అతడ్ని ఏసీబీ అధికారులు హైదరాబాద్ లో అరెస్టు చేశారు.

మొత్తం దందాలు ఆయనే నడిపారువిడదల రజనీ ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న సమయంలో మొత్తం దందాలు ఆయనే నడిపారు. స్టోర్ క్రషర్ యజమానుల్ని బెదిరించి డబ్బులు వసూలు చేసిన కేసులో ఆయన నిందితుడిగా ఉన్నారు. ఆయన బెదిరించి డబ్బులు వసూలు చేసినట్లుగా అనేక ఫిర్యాదులు పోలీసులకు అందాయి. చిలుకలూరిపేట నియోజకవర్గంలో ఐదు సంవత్సరాల పాటు ఆయన చేసిన అరాచకం గతంలో ఎవరూ చేయలేదన్న విమర్శలు నియోజకవర్గ ప్రజల నుంచి వచ్చాయి.
ఆమెకు అరెస్టు ముప్పు
విడదల రజనీతో కలసి డబ్బులు వసూలు చేయడాన్ని ఓ వ్యాపకంగా మార్చుకుని కోట్లు కూడబెట్టారన్న ఆరోపణలు ఉన్నాయి. వైసీపీ ఓడిపోయిన తర్వాత కొంతమందికి తిరిగి డబ్బులిచ్చారు. కానీ ఇంకా ఎంతో మంది తమ డబ్బు తమకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. చాలా మందిని ఇప్పటికీ బెదిరిస్తున్నారు. రాజకీయం వేధింపులు అని చెప్పుకుని కవర్ చేయడానికి విడదల రజని ప్రయత్నిస్తున్నారు కానీ.. ఆమెకూ అరెస్టు ముప్పు పొంచి ఉంది.
Read Also: ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత సీట్లు.. 28 నుంచి దరఖాస్తులు