నోటీసులు జారీడీ అడిక్షన్ సెంటర్లపై ప్రజల్లో సరైన అవగాహన లేదని హైకోర్టు అభిప్రాయపడింది. ఈ కేంద్రాలపై విస్తృత ప్రచారం చేయాలని ప్రభుత్వానికి సూచించింది. మద్యం విముక్తి కేంద్రాలపై అవగాహన కల్పించడానికి తీసుకుంటున్న చర్యలు, కేటాయించిన బడ్జెట్ వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆరోగ్య, ఎక్సైజ్ శాఖల ముఖ్య కార్యదర్శులకు నోటీసులు జారీ చేసింది. ఒక వ్యక్తికి నెలలో అమ్మే మద్యం సీసాల సంఖ్యను పరిమితం చేయాలన్న పిటిషనర్ అభ్యర్థనను మాత్రం కోర్టు తోసిపుచ్చింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకుర్, జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రజా ప్రయోజనండీ అడిక్షన్ సెంటర్ల పనితీరును పర్యవేక్షించాలని, బాధితులకు అందుతున్న చికిత్సను పరిశీలించాలని ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ విశాఖపట్నానికి చెందిన షిరిన్ రెహ్మాన్ హైకోర్టులో పిల్ వేశారు. ఆధార్ కార్డుతో లింక్ చేసి 21 ఏళ్లలోపు వారికి మద్యం అమ్మకుండా ఆపాలని కోరారు.హైకోర్టు, పిల్ యొక్క ఉద్దేశం ప్రజా ప్రయోజనంపై సందేహాలు వ్యక్తం చేసింది. ఒక పిల్ దాఖలు చేసినప్పుడు, దాని వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటో స్పష్టంగా తెలియజేయాలని, అంతేకాకుండా అది ప్రజా ప్రయోజనానికి అనుకూలంగా ఉందో లేదో పరిశీలించాలని హైకోర్టు అభిప్రాయపడింది.
Read Also: Vidadala Rajini : మాజీ మంత్రి విడదల రజిని మరిది గోపి అరెస్ట్